IPL 2025 | టాస్ గెలిచిన గుజ‌రాత్.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరేనా..?

Gt Vs Dc

IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans), ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) కీల‌క మ్యాచ్‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ పోరులో గెల‌చిన జ‌ట్టు నాకౌట్‌కు దూసుకెళ్ల‌డం ఖాయం. ఇరుజ‌ట్లు విజ‌యంపై క‌న్నేసిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజ‌రాత్ సార‌థి శుభ్‌మ‌న్ గిల్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, సొంత గ‌డ్డ‌పై అక్ష‌ర్ ప‌టేల్ బృందం ప్ర‌త్య‌ర్థికి భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించాల‌నే ప‌ట్టుద‌లతో ఉంది.

గెలిచి తీరాల్సిన మ్యాచ్ కావ‌డంతో పేస‌ర్ క‌గిసో ర‌బ‌డ‌ను తీసుకుంది గుజ‌రాత్. ఇక మిచెల్ స్టార్క్ స్థానంలో ముస్తాఫిజుర్, క‌రుణ్ నాయ‌ర్ బ‌దులు స‌మీర్ రిజ్వీ ఢిల్లీ జ‌ట్టులోకి వ‌చ్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ 6 సార్లు త‌ల‌ప‌డిన గుజ‌రాత్, ఢిల్లీ.. మూడేసి విజ‌యాలు సాధించాయి.

గుజ‌రాత్ టైటాన్స్ తుది జ‌ట్టు : శుభ్‌మ‌న్ గిల్(కెప్టెన్), జోస్ బ‌ట్ల‌ర్(వికెట్ కీప‌ర్), షెర్ఫానే రూథ‌ర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, ర‌షీద్ ఖాన్, క‌గిసో ర‌బ‌డ‌, అర్ష‌ద్ ఖాన్, సాయి కిశోర్, సిరాజ్, ప్ర‌సిధ్ కృష్ణ‌.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ తుది జ‌ట్టు :  ఫాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పొరెల్, స‌మీర్ రిజ్వీ, కేఎల్ రాహుల్(వికెట్ కీప‌ర్), అక్ష‌ర్ ప‌టేల్(కెప్టెన్), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్, అశుతోష్ శ‌ర్మ‌, విప్ర‌జ్ నిగ‌మ్, కుల్దీప్ యాద‌వ్, న‌ట‌రాజ‌న్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

Leave a Comment