
Street lights | రామాయంపేట, మే 18 : అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో పట్టపగలే వీధిలైట్లు వెలుగుతున్నాయి. అయినా అవేవీ పట్టనట్టుగా రామాయంపేట పురపాలక శాఖ పరిస్థితి ఉంది. రామాయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారి, రెవెన్యూ కార్యాలయం, బీసీ కాలనీ రోడ్డులో విద్యుత్ స్థంభాలకు ఉన్న లైట్లు గత కొన్ని రోజులుగా పగలూ, రాత్రి వెలుగుతూనే ఉన్నాయి.
అయితే ఈ విషయమై మున్సిపల్ సిబ్బందికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు, కాలనీ వాసులు వాపోతున్నారు. ప్రభుత్వం ఒక పక్క విద్యుత్‌ను ఆదాచేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా.. పురపాలక శాఖ పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.