Nagarkurnool | బైక్‌ అదుపుతప్పి యువకుడు మృతి

Ramesh

వెల్దండ : నాగర్ కర్నూల్ (Nagarkurnool ) జిల్లా వెల్దండ మండలం కొట్రా గ్రామానికి చెందిన భూత్కూరి రమేష్ (25) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) మృతి చెందాడు. గ్రామానికి చెందిన రమేష్ వెల్దండ మండలం బైరాపూర్ గ్రామానికి తన బంధువుల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌( BIke ) అదుపుతప్పి బోల్తాపడడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని వెల్దండ పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Leave a Comment