రైతు భరోసా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20.06.2025గా ప్రకటించబడింది. అయితే, అధికారుల ప్రకారం, వెబ్‌సైట్‌ను 18.06.2025 నుంచే ఫ్రీజ్ చేయనున్నట్లు సమాచారం

అంతటి వరకు వేచి ఉండకుండా 18.06.2025కి ముందే దరఖాస్తు చేయడం మంచిది, లేదంటే మీ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది.

ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే ఈ కింద ఉన్న పత్రాలు అవసరం:

1)దరఖాస్తు ఫారమ్

2)ఆధార్ కార్డు

3)పట్టాదారు పాసుబుక్ / భూమి పత్రాలు

4)బ్యాంక్ ఖాతా వివరాలు

మొబైల్ నెంబర్

దరఖాస్తు సమర్పించాల్సిన స్థలం: సంబంధిత గ్రామ రైతు వేదిక

Leave a Comment