పిల్లలకు సురక్షితంగా కోడింగ్ నేర్పించే ఉత్తమ వెబ్‌సైట్లు – తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోసం మార్గదర్శకం
ఈ డిజిటల్ యుగంలో పిల్లలు చిన్న వయస్సులోనే కోడింగ్ నేర్చుకోవడం సహజంగా మారింది. అయితే, వారికి సురక్షితమైన, మితమైన మరియు వయస్సుకు తగ్గ మాధ్యమాలు ఎన్నుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో, పిల్లలకు సురక్షితంగా కోడింగ్ నేర్పించే పలు ప్రముఖ వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ఉచితం కాగా, మరికొన్ని చెల్లించాల్సిన ప్లాట్‌ఫారమ్లు కూడా ఉన్నాయి.
ప్రారంభ స్థాయిలో కోడింగ్ నేర్చేందుకు…
Scratch (https://scratch.mit.edu)
MIT రూపొందించిన ఈ ప్లాట్‌ఫారమ్ 8–16 ఏళ్ల పిల్లల కోసం. ఇది బ్లాక్ ఆధారిత ప్రోగ్రామింగ్‌ను సరళమైన రీతిలో నేర్పుతుంది. పిల్లలు తమ ప్రాజెక్టులను పంచుకోవచ్చు, ఇతరుల ప్రాజెక్టులను రీమిక్స్ చేయవచ్చు.
Blockly Games (https://blockly.games)
Google అభివృద్ధి చేసిన ఈ వెబ్ ఆధారిత గేమ్స్ ద్వారా పిల్లలు ఆటల రూపంలో కోడింగ్ నేర్చుతారు. భవిష్యత్తులో JavaScript వంటివాటికి మారటానికి బేస్ సిద్ధం చేస్తుంది.
కోర్సుల మాదిరిగా స్థాయినుసారంగా నేర్చుకోవాలంటే…
Code.org (https://code.org)
ఈ లాభాపేక్షలేని సంస్థ ద్వారా K–12 విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ పాఠాలు ఉచితంగా అందించబడతాయి. “Hour of Code” కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
Tynker (https://www.tynker.com)
5 ఏళ్లు పైబడిన పిల్లల కోసం డిజైన్ చేయబడిన ఈ ప్లాట్‌ఫారమ్ బ్లాక్ కోడింగ్ నుంచి Python, JavaScript వంటి కోడింగ్ భాషల వరకూ గైడ్ చేస్తుంది. Minecraft, డ్రోన్లు వంటి ఆకర్షణీయమైన ప్రాజెక్టులతో పిల్లలు మరింత ఆసక్తిగా నేర్చుకుంటారు.
CodeCombat (https://codecombat.com)
RPG గేమింగ్ వాతావరణంలో కోడింగ్ నేర్పే ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పిల్లలు JavaScript, Python లాంటి భాషలను నేర్చుకుంటారు. ఆటలతో పాటు అభ్యాసం కూడా చేయవచ్చు.
CodeHS (https://codehs.com)
Java, JavaScript వంటి భాషలపై పాఠ్యాంశాలతో స్కూల్ లెవెల్ కోర్సులుగా డిజైన్ చేయబడిన ఈ వెబ్‌సైట్‌లో ఇన్‌స్ట్రక్టర్ల పర్యవేక్షణలో విద్యా బోధన జరుగుతుంది.
CodeMonkey (https://www.codemonkey.com)
పిల్లలు సమస్యలను పరిష్కరించేందుకు కోడ్ వ్రాస్తూ ఆటల ద్వారా నేర్చుకునే విధానంలో ఇది రూపొందించబడింది. CoffeeScript, Python వంటి భాషలు అందుబాటులో ఉన్నాయి.
భౌతిక + డిజిటల్ మిక్స్ ప్లాట్‌ఫారమ్
Bitsbox (https://bitsbox.com)
6–12 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన ఈ ప్లాట్‌ఫారమ్ JavaScript కోడింగ్ నేర్పుతుంది. ప్రతి నెల బాక్స్ రూపంలో ప్రాజెక్టులను పంపించి పిల్లల్లో ఆసక్తిని పెంచుతుంది.
పిల్లల భద్రత కోసం ప్రత్యేక లక్షణాలు
ఈ వెబ్‌సైట్లు వయస్సుకు అనుగుణంగా డిజైన్ చేయబడి ఉండడం, కంటెంట్ మోడరేషన్ ఉండడం, ప్రైవసీ పరిరక్షణ ఉండడం వంటి అంశాల్లో ముందుంటాయి. స్కూల్‌లు కూడా ఈ ప్లాట్‌ఫారమ్లను తమ లెర్నింగ్ సిస్టమ్‌లో భాగంగా వినియోగిస్తున్నాయి.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకి సూచన
మీ పిల్లలు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే, వారి వయస్సు, ఆసక్తులకు అనుగుణంగా ఈ ప్లాట్‌ఫారమ్లను పరిశీలించవచ్చు. సృజనాత్మకంగా ప్రాజెక్టులు రూపొందించాలంటే Scratch, Blockly Games బాగా సహాయపడతాయి. స్థాయినుసారంగా కోర్సులు కావాలంటే Code.org, CodeHS మంచి ఎంపికలు. ఆటల ద్వారా కోడింగ్ నేర్చాలనుకునే పిల్లల కోసం CodeCombat, CodeMonkey ఉత్తమంగా ఉండవచ్చు.
మీ పిల్లలకు సరిపోయే కోర్సును ఎంచుకునేందుకు ఇంకా సందేహాలుంటే, ప్రతి వెబ్‌సైట్ అధికారిక పేజీలను సందర్శించి వివరాలు తెలుసుకోవడం మంచిది.
for more details https://www.websiteplanet.com/blog/safest-coding-sites-for-kids/
for more articles