ఉద్యోగుల పెండింగ్ D.A లు విడుదల మరియు పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విజ్ఞప్తి చేసిన టీఎన్జీవో

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి గారిని కలిసి టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధానకార్యదర్శులు శ్రీ మారం జగదీశ్వర్ మరియు శ్రీ ముజీవ్ హుస్సేన్ గార్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పలు సమస్యలపై 15.10.2024 నాడు వినతి పత్రం సమర్పించనైనది…
స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని, ఏపీ నుండి తెలంగాణకు తిరిగి వచ్చిన తెలంగాణ ఉద్యోగులకు పోస్టింగ్ ఇచ్చి జీతాలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న డిఏ మరియు బిల్లులను లను విడుదల చేయాలని, జీవో 317ను పున సమీక్షించాలని, సిపిఎస్ ని రద్దు చేసి OPSను పునరుద్ధరించాలని వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది… ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు సానుకూలంగా స్పందించి త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం సహా అధ్యక్షులు శ్రీ ముత్యాల సత్యనారాయణ గౌడ్ గారు, నగర శాఖ అధ్యక్షులు శ్రీ కే.శ్రీకాంత్ గారు, కార్యదర్శి పంతులు హరికృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Comment